Yanamalakuduru-వేయిమునులకుదురు

yanamalakuduru, Vijayawada, 520007
Yanamalakuduru-వేయిమునులకుదురు Yanamalakuduru-వేయిమునులకుదురు is one of the popular City located in yanamalakuduru ,Vijayawada listed under City in Vijayawada , Public places in Vijayawada ,

Contact Details & Working Hours

More about Yanamalakuduru-వేయిమునులకుదురు

యనమలకుదురు, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామము.
వ్యవసాయము, వ్యవసాయధారిత వ్యాపారము, పాడి పరిశ్రమ ఇక్కడి జీవనాధారాలు. గులాబి తోటలు, జామ తోటలు ఈ ఊరి లో ప్రధానమైనవి. కృష్ణా నది నుంచి పాయగా వచ్చే ఏటి నీళ్ళు పంటలకి అధారం. పుష్కరాల సమయం లో ఈ ఏరు చాలా సందడిగా ఉంటుంది.

ఈఊరిలో ఒక కొండ పైన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది ఎన్నో ఏళ్ళుగా చుట్టు పక్క ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన గుడి. ప్రతి ఏడాది శివరాత్రి కి గుడి లో జరిగే కళ్యాణోత్సవం, ఊరిలో జరిగే తిరునాళ్ళకి పొరుగూరు వారు, వూరి వారి బంధువులు రావటం ఆనవాయితీ.

ఈ వూరి పేరు గురించి వాడుకులో ఉన్న కధ ఏమిటంటే - ఒకానొకప్పుడు కొండపైన మునులు తప్పస్సు చేసుకుంటూ ఉండేవారని. వెయ్యి మంది మునులు అలా కొంత కాలం ఉండటం వల్ల వేయిమునులకుదురు అని పిలిచేవారని, అదే కాలక్రమం లో యనమలకుదురు గా మారిందనీ పెద్దలు చెబుతూ ఉంటారు.
బందరు కాలువ కూడా ఈ ఊరి మీదగా బందరు వైపు వెళ్తుంది. యనమలకుదురు నుంచి విజయవాడ రావాలంటే తప్పనిసరి గా ఈ కాలువ మీద ఉన్న వంతెనల్లో ఎదో ఒక దానిని దాటవలసిందే.

Map of Yanamalakuduru-వేయిమునులకుదురు