Tirumala News

7 Hills, Tirumalai, 517501
Tirumala News Tirumala News is one of the popular Organization located in 7 Hills ,Tirumalai listed under Organization in Tirumalai ,

Contact Details & Working Hours

More about Tirumala News

దేవుడు ఒక్కరే... మతాలు రెండే
ప్రపంచ వ్యాప్తంగా వున్నది... వైదికం... తాత్వికం..
మరో తొమ్మిది గ్రంథాలు..విడుదల
....................................
వేదాలకు(వైదికం) .. ఉపనిషత్తులకు (ఆత్మ బోధ చేసే తాత్వికం) మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఇంత మంది దేవుళ్ల సృష్టి హిందుమతంలో జరిగిపోయింది. ఆశ్చర్యంగా వుండవచ్చు.
భారతదేశంలోనే కాదు...
బైబిల్ లో చూసినా... ఖురాన్ లో చూసినా...
వేదాలకు(వైదికం)కు... ఉపనిషత్తులకు (తాత్వికమతం)కు మధ్య ఘర్షణే కన్పిస్తోంది.
విశ్వగురువు విష్వక్సేనుల వారి అనుగ్రహంతో నేను రాసిన
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను చదివితే
అనేక అనేక సత్యాలు బోధపడుతాయి.
...................
వైదికం.. తాత్వికం మధ్య ఘర్షణ వల్లే
సత్యన్వేషణలో గందరగోళం
.....................
వేలాది సంవత్సరాల క్రితం యజ్ఞలు చేసి, బలులు ఇచ్చే "వైదిక మతం"కు,
ఆత్మ తత్వాన్ని గుణోన్నతిని నేర్పే "తాత్విక మతానికి" మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.
వేలాది సంవత్సరాల క్రితం ఆ రెండిటి మధ్య పరస్పర దూషణల వల్ల అనేక కథలు... రచనలు పుట్టడంతో... అవి.
1. ఆధ్యాత్మిక ఉన్నతికి అనేక అవరోధాలుగా మారాయి.
2. పరస్పర వైరం వల్ల పుట్టిన పుస్తకాలను విమర్శిస్తూ కొందరు పుంకాను... పుంకాలుగా పుస్తకాలూ రాసారు.
వాటిని చదివిన వారిని (అన్ని మతాల వారినీ) అవి గాయపరుస్తున్నాయి.
..............................
రెండు మతాల మధ్య ఘర్షణ వల్లే...
శ్రీవారిని వక్షస్థలంలో తన్నిన కథ
...............................
వైదికం... తాత్వికం మధ్య ఘర్షణలో భాగంగా...
దైవాన్ని కించపరుస్తూ దశవతరాల కథలనూ రాసేశారు.
చివరికి శ్రీవారిని వక్షస్థలంలో భృగు మహర్షి తన్నీనట్టు రాసిన కథ కూడా ఆ ఘర్షణకు అద్దం పడుతోంది.
...............................................
అన్ని మతాల వారి కోసం "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"
మొదట వదులుకోవాల్సింది తెలుసుకుంటే...
...............................................
ఇహంలోనూ, పరంలోనూ ఉన్నతి సాధించటానికి
హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఈ మూడింటిలోనూ వదులు కోవాల్సింది వున్నాయి. సరిగ్గా అర్థం చేసుకోవాల్సినవీ వున్నాయి.
వాటన్నిటిలోని అనేక సత్యాలను తెలియజేయాలని "విశ్వ గురువు విష్వక్సేనుల" వారు ఆదేశించారు.
అందులో భాగంగా మొదట... "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను రచించాం.
దక్షిణభారతదేశంలో వేలాది సంవత్సరాల తరువాత రచించిన ఉపనిషత్తు "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"
........................
మరో తొమ్మిది గ్రంథాలు...
అన్యమతం అనేది మానసిక జబ్బు మాత్రమే
...................
"విశ్వ గురువు విష్వక్సేనుల" అనుగ్రహంతో ఆధ్యాత్మిక సత్యాలతో మరో 9 గ్రంథాలు అందిస్తాం.
అవి...
1. విష్వక్సేన భగవద్గీత
2. ఏసు బోధ
3. ఇస్లాం ఆచరణ
4. బుద్ద జీవిత సూత్రాలు
5. వివేకానంద.. రమణ మహర్షి వంటి ఎంతో మంది భారతీయ తత్వవేత్తల తత్వసారం
6. వేదమార్గం
7. తిరుమల - ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి
8. అష్టాదశ (18) పురాణాల్లోని ఆధ్యాత్మిక రహస్యాలు
9. విష్వక్సేన సందేశం - ఆత్మోన్నతి
..........................
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
తిరుమల జీయర్లు ఆవిష్కరించిన "విష్వక్సేన భగవద్గీత"
........................
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను 2016 శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజు సి.ఎం చంద్రబాబు తిరుమల ఆలయం ముందు పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించారు.
"విష్వక్సేన భగవద్గీత"ను గరుడోత్సవం జరుగుతుండగా... తిరుమల ఇద్దరు జీయర్ స్వాములు మాడవీధుల్లో ఆవిష్కరించారు.
...................
ప్రతి బ్రహ్మోత్సవానికి...
గ్రంథాల విడుదల
.......................
ముందు ముందు విష్వక్సేనుల వారి దయతో నేను రాయబోయే మిగిలిన గ్రంథాలను కూడా
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అందిస్తాం.
...............................
ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా...పి.డి.ఎఫ్ లో
...............................
1. బ్రహ్మోత్సవ ఉపనిషత్తు
2. విష్వక్సేన భగవద్గీతను
www.kaliyuganarada.com
http://kinige.com/book/Brahmotsava+Upanishattu
http://kinige.com/book/Viswaksena+Bhagavadgeeta
నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.జిరాక్సు తీసుకుంటే చదవటానికి సౌకర్యవంతంగా వుండాలిని ఏ 4 సైజులో అందుబాటులో వుంచాం. జిరాక్సు కు పెద్దగా ఖర్చు కూడా కాదు.
...........................
మెయిల్ చేయండి...
........................
ఈ గ్రంథాలపై మీ సందేహాలు... విమర్శలు... ఏవైనా
kaliyuganarada@yahoo.in కు రాయాలని మనవి.
.......................
ఓం నమో వేంకటేశాయ

Map of Tirumala News