Sri Gnana Saraswati Devi Peetam

bhadrakali temple road, Warangal, 506001
Sri Gnana Saraswati Devi Peetam Sri Gnana Saraswati Devi Peetam is one of the popular Hindu Temple located in bhadrakali temple road ,Warangal listed under Hindu Temple in Warangal , Religious Organization in Warangal , Organization in Warangal ,

Contact Details & Working Hours

More about Sri Gnana Saraswati Devi Peetam

నేడు అమ్మవారు సాకారముగా అనుగ్రహించిన స్థలము ,ఒకప్పుడు అరణ్యముగా మునుల,సిద్ధుల తపస్సులచే అలరారిన తపోభూమి. ఆవిధంగా వారి తపస్సులచే అలరరిన ఈ ప్రదేశం కాలాంతరములో వేదపాఠశాలగా అనేక మంది విద్యార్థులకు వేదవిద్యను అందించిన వేదభూమి. (ఆదిశంకరుల శృంగేరి ఆమ్నాయ పీఠాధిపతి 9వ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యస్వామి వారి జన్మ స్థలము మరియు వేదాభ్యాస స్థలము ఈ ప్రదేశమే కావడం స్మరణీయము) ఆ క్రమములో నిత్య వేదపారాయణాది , క్రతువులతొ మరియు అగ్ని కార్యములతో అలరారిన ఈ స్థలాన్ని "వేదప్రియా" "వేదగమ్యా" అయిన ఆ సరస్వతీ దేవి అవ్యక్త రూపిణిగా సాక్షాత్కరించి అనుగ్రహించినది.
( అవ్యక్తరుపము : సామాన్య నేత్ర దృష్టికి కాక ,ఉపాసనా శక్తి గల జ్ఞాన దృష్టి కి మాత్రమే కనబడు రూపము ..
"అనంతమామృతం పరం జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేనపరమమ్ పదం !
జ్ఞానమేవ ప్రవిష్యంతే మామేవ ప్రవిష్యంతితే !! ( కూర్మ పురాణం) "
నా అమృత పరమైన అనంత రూపము మిక్కిలి ప్రయత్నముతో , కేవలం జ్ఞానముతో మాత్రమే పొన్దదగినది . జ్ఞానదృష్టి కలవారు మాత్రమే నన్ను ప్రవేశింతురు.)
కాలప్రవహములొ ఈ స్థలములు ఆక్రమణలకు మరియు నిరాదరణకు గురై వాటి అస్థిత్వాన్నికోల్పోయినవి .
ఆ తదుపరి మన గురువుగారు ,శ్రీ.విద్యోపాసకులు , వేదాంత శిరోమణి బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ
శ్రీ ఉమాశంకర సరస్వతీ(పండిత్) స్వామి వారికి వారి శిష్యులు ఈ ప్రదేశాన్ని మరియు అందులో గృహాన్ని నిర్మించి గురుదక్షిణగా సమర్పించిన తరువాత , వారి నిత్య దేవి ఆరాధనలో అలౌకికానందఅనుభూతి కలుగుతుండటంచే వారు ఈ ప్రదేశములో కొంత కాలము దీక్షాబద్దులై తపస్సు చేయడంతో ఆ తల్లి దర్శనమిచ్చి , ఆశీర్వదించి అనుగ్రహించడంచేత ఈ పీఠము ఏర్పడినది.
నేటికి ఆ తల్లి యొక్క సామీప్యతానుభూతి ఈ పీఠములో కొద్దిపాటి ధ్యానముతో ఉపాసకులు పొందవచ్చును.
ఈ విధముగా ఇంతింతై వటుడిన్తై అన్నట్లుగా ,ఆ తల్లిని దర్శించి ఆ తల్లి అనుగ్రహముతో సకల శుభములను పొందే భక్తుల సంఖ్య దినదినము అభివృద్ధి చెందుతున్నది.

Map of Sri Gnana Saraswati Devi Peetam