Rajamahendravaram

Rajamahendravaram, 533101
Rajamahendravaram Rajamahendravaram is one of the popular City located in ,Rajamahendravaram listed under City in Rajamahendravaram ,

Contact Details & Working Hours

More about Rajamahendravaram

రాజమహేంద్రవరము (మార్పుకి మందు పేరు:రాజమండ్రి) నగరం తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరము. రాజమహేంద్రవర నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవర నగరానికి, ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానీ అని కూడా అంటారు.[2] రాజమహేంద్రవరము గత నామములు రాజమండ్రి, రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలోని నగరాల్లో ఇది 7వ స్థానంలో ఉంది. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిషుపాలనలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరముగా మారుస్తూ నిర్ణయింపబడింది.

Map of Rajamahendravaram