K B N College, Vijayawada, Andhra Pradesh, India.

Kothapet, Vijayavada, 520001
Share
Send Message Add Review

Details

K.B.N. College, Vijayawada, A.P.,
నా పేరు శ్రీధర్ కుమార్ కావూరి. నేను ఇదే కాలేజీని కాక ఇంకా అనేక కాలేజీలను కూడా చూశాను.
అయితే ఆ కాలేజీల పేర్లను ఉదహరించడం కూడా నాకు ఇష్టం లేదు. కారణం ఆ కాలేజీల్లో ప్రిన్సిపాల్సు చవటలు దద్దమ్మలు, కావడం. నాలెడ్జి లేని లెక్చరర్స్ తో నేను బాధలు అనుభవించాను. మా కాలేజీకి ఆనాడు ఎస్ సుందరంగారని ఎంతో ఉత్తమోత్తమమైన పిన్సిపల్ వుండేవారు. నిజంగా ఆయన స్టూడెంట్స్ ని తన బిడ్డల్లాగా చూడడం వాళ్ళని అనేక గొడవల్లోంచి కాపాడం నేను నా కళ్లతో చూశాను. నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యేనాటికి నాకు హిస్టరీ, స్పెల్లింగ్ ని కూడా ఇంగ్లీషులో రాయలేని స్థితిలో ఉండేవాణ్ణి. ఇంక ఎకనామిక్స్ స్పెల్లింగ్ అంటే నాకు చాలా చాలా ఎక్కువ స్థాయి పదం. అదీ నిజంగా నా పరిస్థితి. నా పరిస్థితిని నా లెక్చరర్స్ కి ముందుగానే వివరించి చెప్పేశాను. నేనంత అధోగతిలో ఉన్నానో చాలా స్పష్టంగా వాళ్లకి చెప్పి వారి సహాయాన్ని అర్ధించాను. నన్ను నా సొంత కన్న తండ్రుల్లా చూసుకున్నారు. అర్ధంకాక పోతే వివరించి చెప్పేవారు. తెలుగులో రెండు పదాలు కూడా సరిగ్గా రాయలేని నేను వారి సూచనలు వారి అత్యున్నతమైన బోధన ఫలితంగా డిగ్రీ సెకెండ్ ఇయర్ లో (డా. చివుకుల సుందరరామ శర్మగారు, కేకెవిశ్వేస్వర శాస్త్రి గారు వంటి మంచి ఉపన్యాసకుల వల్ల ) నేను తెలుగులో 89 మార్కుల్ని తెచ్చుకున్నాను. (అప్పుడు అదే హైయ్యస్ట్) ఎకనామిక్స్ లో 65 హిస్టరీలో 58 మార్కుల్ని తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్ తప్పి డిగ్రీలో చేరిన నేను నా సెకెండియర్ వచ్చేసరికి అన్ని మార్కుల్ని తెచ్చుకుంటానని కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు.
హిస్టరీ లో ధారా సత్యనారాయణ శర్మ గారు, అత్యద్భుతంగా పాఠం చెప్పేవారు. ఇప్పటికీ ఆయన చెప్పిన పాఠాలు కళ్ళముందు సినిమాల్లాగా నాకు కనిపిస్తాయ్. ప్రతిరోజూ వాళ్ళు ప్రిపేర్ అయ్యి మాత్యమే మాకు పాఠం చెప్పేవాళ్ళు. సొల్లు కబుర్లు పోసుకోలు సోదులతో కాలం వెళ్లబుచ్చడం కాదు. అసలు మా లెక్చరర్స్ పాఠం చెబుతుంటే, నాకు ఆ కాలేజీ లో ఉన్న అన్ని ఇతర క్లాసుల్లో స్టూడెంట్స్ నీ తీసుకొచ్చి మా క్లాస్ లో పాఠం ముందు తెలుసుకోండి. జీవితానికి ఇవి చాలా అవసరం అని చెప్పి వాళ్ళని కూడా మా క్లాసుకు లాక్కుని రావాలని పించేది నాకు. అలాంటి ఈ అత్యుత్తమమైన ఉపాథ్యాయుల్ని చూశాను నేను ఈ కాలేజీలో. అసలు ఇంటర్మీడియట్ కూడా పాస్ అవుతానని అనుకోని నేను, తప్పి తరువాత పాస్ అయిన నేను, డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయ్యానంటే దానికి కారణం నాకు లభించిన గొప్ప హృదయం కలిగిన గురువులేనని మనసా వాచా చెప్పగలను. నా క్లాస్ మేట్స్ గా వున్న శ్రీనివాస్, రవీంద్ర, కె. మంజుల, లలిత, మొదలైన వాళ్లు నాకు ఇచ్చిన పోటీతో నేను నిద్రకూడా పోలేక పోయేవాణ్ణి. అంత బాగా చదివేవాళ్ళు వాళ్ళు. వారి పట్ల నాకు గల కృతఙ్ఞత ఈ నాటికి నా గుండెల్లో పదిలంగా నిండివుంది. ఆ గురువులని నేను ఆ తరువాత కూడా ఒక ఆరు సంవత్సరాల వరకూ కలుస్తూనే వుండే వాణ్ణి. ఆ తరువాత వాళ్లు ఇళ్ళు మారిపోవడం నాకు కూడా కుదరక పోవడం వల్ల మిస్సైపోయాను. ఈ కాలేజీ లో బిఏ డిగ్రీ చేసిన నేను ఆ తరువాత ఎమ్ ఏ ఎకనామిక్స్ చేశాను. ఆ తరువాత మద్రాస్ యూనివర్సిటీ లో ఎమ్ ఏ తెలుగు సాహిత్యం చదివాను. నేను The Aesthetic Methodology of Film Story and Screenplays మీద Ph.D., చేశాను. నేను చేసిన ఆ Ph.D., పరిశోధనలో నాకు ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా గారు, ప్రొఫసర్ ఎల్ బి శంకర్రావు గారు నాకు గైడ్స్ గా వుండి ఎంతో హెల్ప్ చేశారు. కళాతపస్వి కె. విశ్వనాధ్ గారి దయ వల్ల, వారి సతీమణి జయలక్ష్మి గారి ఆదరణ వల్లా నేను వారింట్లోనే వుండి వారి వద్ద వారి కధలు వింటూ వారిని చూస్తూ వారి వద్ద ఎంతో నేర్చుకున్నాను. నా అభిప్రాయాలు వారు అడుగుతూ నా తప్పొప్పులను సరిదిద్దుతూ నాకు వివరిస్తూ చెపుతూ ఎన్నో రకాలు గా నన్ను తీర్చి దిద్దారు. ఆ తరువాత రామోజీ ఫిలింసిటీలో కొంతకాలం పనిచేసి ఇప్పుడు నేను సినిమా కధలు రాసుకుంటూ నా సినిమా డైరెక్షన్ పనిలో పడ్డాను. నా లోని ప్రతి ఉత్సాహానికీ ఈ కాలేజీలోనే పునాది పడిందని నేను మనసా వాచా చెప్పగలను. నాకు క్లాస్ మేట్ శ్రీనివాస్ రైటింగ్ ని, అతని క్రమశిక్షణని, అతను బ్రూస్లీలా చేసే కరాటే ప్రాక్టీస్, అతని ఎక్సర్ సైజెస్ చూసి నేను సిగ్గుపడేవాణ్ణి. అతని లా మారే ప్రయత్నంలో నేను ఎన్నో ఉత్తమ గుణాలు ఎంతో ఆరోగ్యం నాలోకి వచ్చాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. చదువులో ప్రేమగా ఎంకరేజ్ చేసే మిత్రులు కూడా నాకు లభించారు. ఇన్నింటిని నాకు ఇచ్చిన ఆ కాలేజీని నేను మరచిపోవడం అసాధ్యం కదా.
మా కాలేజీ లో నేను నేర్చుకున్న “ఓం సహనావ వతూ...” అనే ఉపనిషత్ శ్లోకం ఇంకా నా హృదయం లో పదిలంగా వుంది. మా కాలేజీని మళ్లీ నాకు ఇప్పుడు బాగా చూడాలని పిస్తోంది.
Dr. Shridhar Kumar Kavuri, M.A., Eco., M.A., Lit., Ph.D.,

Map

Updates From K B N College, Vijayawada, Andhra Pradesh, India.

Share Your Experiance About K B N College, Vijayawada, Andhra Pradesh, India.

Other Information

Other Categories: